స్థానిక సంస్థల ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆర్.డి.ఓ కార్యాలయంలో ఆర్.డి.ఓ పార్థసింహారెడ్డి అధ్యక్షన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఎస్ఐఆర్ ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఉందా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ సమయంలో పేరు గల్లంతయింది అని చెప్పకుండా తమ తమ బాధ్యతలుగా భావించి ప్రతి పౌరుడు ఓటర్...