Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 6:28 pm Posted by : ramakrishna

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆర్.డి.ఓ కార్యాలయంలో ఆర్.డి.ఓ పార్థసింహారెడ్డి అధ్యక్షన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఎస్ఐఆర్  ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఉందా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ సమయంలో పేరు గల్లంతయింది అని చెప్పకుండా తమ తమ బాధ్యతలుగా భావించి ప్రతి పౌరుడు ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆన్లైన్ కేంద్రంలో గాని తహసిల్దార్ కార్యాలయంలో గాని ఫామ్ నింపి ఇస్తే చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మార్లు సాయిబాబు, బిజెపి మండల అధ్యక్షులు నర్సింలు, ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్రోళ్ల ఎల్లు బాబు, నాయకులు,  ప్రవీణ్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.