అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలి

జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్ కామారెడ్డి, బతుకమ్మ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమిష్టి సహకారంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.పి. మాట్లాడుతూ, 18వ లోకసభ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారీగా దిశ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని అన్నారు. కేంద్ర...