మంత్రులంతా అవినీతి అనకొండలు
కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన పీసీసీ అంటేనే ప్రదేశ్ కరెప్షన్ సెంటర్ బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పనులను బట్టి మంత్రులకు లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలవని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి మంత్రి పేషీలో ఇదే తంతు...