Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 12:43 pm Posted by : ramakrishna

ప్రారంభమైన ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్- 2025

హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్‌లోని ఆర్.బి.వి.ఆర్.ఆర్. పోలీస్ అకాడమీలో మంగళవారం  ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 ప్రారంభమైంది.. మూడు రోజుల పాటు ఈకార్యక్రమం జరగనుంది.  తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2015 తర్వాత తెలంగాణలో రెండోసారి ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 21 రాష్ట్రాల నుంచి సుమారు 1300 మంది జైలు శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. క్రీడా, సాంకేతిక అంశాల్లో సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ వంటి 36 ఈవెంట్లలో వీరు పోటీ పడనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPR&D) ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీట్ జైలు సిబ్బంది మధ్య సమన్వయం, నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది.


All India Prison Duty Meet- 2025 begins