Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 5:47 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పనులన్ని వేగవంతం చెయ్యాలి

  • మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ రావు

 

భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వం చేపడుతున్న అన్ని శాఖల పనులను వేగవంతం చేసి నిర్ణత సమయంలో పూర్తి చెయ్యాలని మండల ప్రత్యేకధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు కోరారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ను ఆయన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ,వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు,వనమహోత్సవము తదితర అంశాలపై అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తిచేయాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏవో లావణ్య,ఎం పి ఓ జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్,ఏపీ ఓ నరసయ్య, ఆర్టికల్చర్ అధికారి,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.