పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
బోధన్ ఏసీపి శ్రీనివాస్ రుద్రూర్, బతుకమ్మ: ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని శనివారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలలో ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ఏసిపి వెంట రుద్రూర్ ఎస్సై సాయన్న, ఎంఈఓ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.