భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

  . . . మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఊర పండుగ వేడుకలకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించనున్న సంప్రదాయ ఊరపండుగ ఏర్పాట్లను పురస్కరించుకుని నగర మేయర్, నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు...