Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 6:53 pm Posted by : ramakrishna

డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లపై కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న ఆదేశాల మేరకు అధ్యాపకులు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ వాల్ పోస్టర్ లు అతికించి, బ్యానర్లు కడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామస్తులను కలిశారు. అలాగే గ్రామాల్లో మై కానౌన్స్మెంట్ చేస్తూ ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ మండలంలో 8 గ్రామాలు, ఏర్గాట్ల మండలంలో 8 గ్రామాలు, కమ్మర్ పల్లీ మండలంలో 7 గ్రామాలు, గు వేల్పూర్ మండలంలో 7 గ్రామాలు, మెండోరా మండలంలో 3 గ్రామాల్లో,  మొత్తం ఐదు మండలాల్లో 33 గ్రామాల్లో ప్రచార నిర్వహించారు. రూ. 7.32 కోట్లతో 32 గదులలో ప్రకృతి ఒడిలో అన్ని వసతులు కలిగిన మోర్తా డిగ్రీ కళాశాలలో చేరాలని పలువురికి అవగాహన కల్పించారు. కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్, స్కాలర్షిప్ లు,  బస్ పాస్ లు,  ప్రభుత్వ ఉద్యోగ ఉచితంగా కోచింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, కోఆర్డినేటర్ దశరథ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

All facilities in the degree college