Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 9:44 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలు

  • ప్రభుత్వ బడులల్లోనే మీ పిల్లల్ని చేర్పించండి
  • జడ్పిఎచ్ఎస్ రామన్నపేట్ హెచ్. ఎం. శివాజీ

వేల్పూర్, బతుకమ్మ : ప్రయివేట్ స్కూల్లతో పోలిస్తే అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించాలని రామన్నపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టారు శివాజీ కోరారు. మంగళవారం మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం లో భాగంగా పాఠశాల సిబ్బందితో గ్రామంలోని ఇంటింటికి తిరిగి పాఠశాల పరిస్థితి, సౌకర్యాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించాలని కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తే ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత నోటుబుక్స్, మధ్యాహ్నభోజనం పెడతారని చెప్పారు. అంతే కాకుండారెండు జతల ఉచితంగా స్కూల్ డ్రెస్సులు, పిల్లలకు రాగిజావను ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలకు త్రాగడానికి ఆర్. ఓ ఫ్లాంట్ ద్వారా మంచినీటిని అందిస్తామని,1 నుండి 5 వ తరగతుల విద్యార్థులకు ఎ ఐ ఆధారిత బోధన, స్మార్ట్ టి. వి ద్వారా డిజిటల్ పాఠాలు, 6 నుండి 10 వ తరగతి విద్యార్థులకు ఐ ఎఫ్ పీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డుల ద్వారా బోధన చెయ్యడం జరుగుతుందన్నారు.12 డెస్క్ టాప్ కంప్యూటర్ ల ద్వారా కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం,క్రీడా సామాగ్రి ద్వారా ఆటలు, విద్యార్ధినుల  ఆత్మ రక్షణ నిమిత్తం కరాటే మాస్టర్ ద్వారా కరాటే నేర్పించడం జరుగుతుందని తెలిపారు. పై సౌకర్యాలు అన్నీ మన పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ రాబోవు విద్యా సంవత్సరం నుండి గ్రామంలోని విద్యార్థులందరిని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయ బృందం నరేందర్, వేణు గోపాల్,మనోహర్, శ్రీకాంత్,గణేష్,నరేష్ శ్యాంచరణ్,గంగాధర్, జ్యోతి, స్రవంతి పాల్గొన్నారు.

All facilities in government schools