ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు ఉద్యమిద్దామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ అన్నారు. బుధవారం పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినీత, గంగరాజు ల అధ్యక్షతన పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు....