Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 6:21 pm Posted by : ramakrishna

ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు ఉద్యమిద్దామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ అన్నారు. బుధవారం పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినీత, గంగరాజు ల అధ్యక్షతన పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం టీజీవీఏ ఫోరం అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గ బృందాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎమ్.హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన త్వరలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించుకోబోయే టీఎన్జీవో 80 వసంతాల కార్యక్రమానికి ప్రతి ప్రాథమిక సభ్యుడు ఉద్యమస్ఫూర్తితో విచ్చేసి హక్కుల సాధన కొరకై తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు గంగాధరయ్య, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, పోల శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు మంజుల, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు కుంట శశికాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.