- సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి
భీమ్ గల్, బతుకమ్మ: సమాజంలోని కుల, మతలాన్నింటిని గౌరవించాలని, కుల, మత భేదాలను వదిలి అందరు ముందుకు సాగాలని భీమ్ గల్ సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి అన్నారు. శుక్రవారం రంజాన్ ఉపవాసాల సందర్బంగా ముస్లీం సోదరులకు స్థానిక సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనదని, రంజాన్ నెలలో ముస్లింలు నెల రోజుల వరకు ఉపవాస దీక్షలు ఏమి తిను తాగకుండా 14 గంటల వరకు ఉపవాస దీక్ష చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ పీ కన్నె సురేందర్,ఉపాధ్యక్షుడు గంగ మోహన్ , రైటర్ పర్సన్ నవీన్, క్యాషర్ కాపు కుమ్మరి హరీష్, సర్వ సమాజ్ కమిటీ సలహా సభ్యులు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అంజు అలీ, మదర్సా కమిటీ అధ్యక్షుడు ఫహీమ్,మైనార్టీ అంజు మాజీ అధ్యక్షుడు తాహిర్ హుస్సేన్, కమిటీ సభ్యులు జాహీద్ హుస్సేన్, ఫయాజ్, మజ్జు, అంజుమన్, మదర్స కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.