పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల, అంబం గ్రామ శివారులోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, శుక్రవారం మార్చి 20 వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు గాలి, వెలుగు స్పష్టంగా వచ్చేటట్లు, విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండేందుకు డ్యూయల్ డెస్క్ టేబుల్...