- డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు పట్టణంలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ని రెండు లక్షల మెజారిటీతో గెలిపించాలని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ దళిత విద్యార్థి సంఘం నాయకులు పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా కనకం వంశీ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థనే మెరుగుపరిచి ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డి దని అన్నారు. భవిష్యత్తులో కూడా నరేందర్ రెడ్డి ని ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు కళాశాలలు, విశ్వవిద్యాలయంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తాడని తెలిపారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్కారానికి విద్యను అందించడమే తన మొదటి ప్రాధాన్యమని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని అన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని కనకం వంశీ తెలిపారు.ఇట్టి సమావేశంలో డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు జేరిపోతుల నర్సిములు,దళిత విద్యార్థి సంఘము రాష్ట్ర నాయకులు, శనిగరపు సంతోష్, డి ఎస్ ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కవ్వంపల్లి శ్రావణ్, ఎస్. కిరణ్ తేజ నిజామాబాదు జిల్లా ఇంచార్జి,గాగుర్ల సత్యనారాయణ డి ఎస్ ఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
