Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 1:37 pm Posted by : ramakrishna

మద్యం మత్తులో తల్లిపై దాడి.. ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మద్యానికి బానిసైన యువకుడు మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఉరేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పాపి విష్ణు(21) మంగళవారం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మత్తులో ఉన్న అతడు తన తల్లిపై దాడి చేసి ఇంటి మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.