Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 7:41 pm Posted by : ramakrishna

అర్హులైన పిల్లలందరికీ అల్బెండజోలం మాత్రలు ఇవ్వాలి

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అర్హులైన పిల్లలందరికీ హాల్బెండజోళ్ మాత్రలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి జిల్లా స్థాయి సమన్వయ, శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 10న జిల్లా వ్యాప్తంగా  1 -19 సంవత్సరాల పిల్లలందరికీ  నులిపురుగుల నిర్మూలన కొరకు అల్బెన్దజోల్ మాత్రలు వేయడం  జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం  అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, సోషల్ వెల్ఫేర్ , బి.సి వెల్ఫేర్ , మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, కళాశాలల్లో మరియు హాస్టల్స్లో, మతపరమైన పాఠశాలలు, కళాశాలల్లో ఈ  అల్బెన్దజోల్  మాత్రలు అందించబడుతుంది అని తెలియ జేశారు. విద్యార్థుల ద్వారా వారి వారి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తెలియజేసే, పాఠశాల ప్రార్థన సమయంలో, ఎస్ఎంసి సమావేశాల్లో అవగాహన కలిగించాలని అన్నారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, మతపరమైన పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఈ అల్బెన్దజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలియజేసారు. అల్బెన్దజోల్ మాత్రలు పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఈ మాత్రలు తీసుకోవడం వల్ల పిలల్ల ఆరోగ్యానికి మంచిదని, ఈ మాత్ర వల్ల నులిపురుగులను, రక్తహీనతను నిర్మూలించి ,పోషకాహార లోపాలని  అరికట్టవచ్చని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ రమేష్, డాక్టర్ రాజు, డాక్టర్ అంజన్న, పిఓ డాక్టర్ వినీత్,ఆర్.బి. స్.కె మేనేజర్ సచిన్, జిల్లా ఆరోగ్యవిద్య శిక్షకులు వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ వెంకటేశం, దీపిక, ఆర్.బి. స్.కె సిబ్బంది, ప్రోగ్రాం ఆఫీసర్ లు పాల్గొన్నారు.

Albendazolam tablets should be given to all eligible children