Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 7:01 pm Posted by : ramakrishna

బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలిత ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ : బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలితను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు, డాక్టర్ కొండ దేవయ్య పటేల్ రాష్ట్ర బీసీ కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కరరావు ఆధ్వర్యంలో ఆకుల లలితను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాలు 584 మండలాలు సుమారు 12000 గ్రామ బీసీ సంఘాలు అందరిని కలుపుకొని మహిళ కమిటీలు ఏర్పాటు చేయాలని, త్వరలో బీసీ సాధికారత మహిళా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, కాసారం రమేష్, ప్రసాద్, కాపు బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈసంపల్లి వెంకన్న, జనరల్ సెక్రటరీ జె.వి.ఆర్, స్టేట్ మహిళా కన్వీనర్ వేముల తిరుమల దేవి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వేముల లక్ష్మణ్, బీసీ గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు ఆర్మీ మహేందర్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ బీసీ సాధికారత సంఘం సిటీ  ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు, బిసి మహిళ గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ గంగుల అంజలి యాదవ్, స్టేట్ సెక్రటరీ ఆకుల బాలకృష్ణ పటేల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశెట్టి శివ పటేల్, స్టేట్ సెక్రటరీ పొలాస వాసు చారి పాల్గొన్నారు.