పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఆకుల అరుణ,భారతి

ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక బతుకమ్మ, నిజామాబాద్ పిఓడబ్ల్యు నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ  నగరంలోని ద్వారక నగర్ లోని ఇఫ్ట్ కార్యాలయంలో జరిగింది. జిల్లా మహాసభలో పీవోడబ్ల్యూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల అరుణ (నిజామాబాద్), ఉపాధ్యక్షులు యం.లక్ష్మి(బాల్కొండ), అగ్గు సునీత( మోపాల్), జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి(మెంట్రాజ్ పల్లి), సహాయ కార్యదర్శులు పుష్పాలత( బోధన్), లాస్య(ఆర్మూర్), కోశాధికారి జి.సంజన(నిజామాబాద్), జిల్లా కార్యవర్గ సభ్యులుగా విజయలక్ష్మి(బోధన్), చిట్టెక్క(ఆర్మూర్),వి.పద్మ(దర్పల్లి), వేల్పూర్ లక్ష్మి(...