Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 6:03 pm Posted by : ramakrishna

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యువజన వారోత్సవాలు

బతుకమ్మ, జుక్కల్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాలు పూర్తి చేసుకొని గెలిచిన వారికి బుధవారం బహుమతులు అందజేశారు. జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలలో కూడా మన చైతన్యాన్ని చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రోహిత్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ కృష్ణమోహన్, పూర్వ కార్యకర్తలు సతీష్, గజనంద్ మరియు పాఠశాలల నుండి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, శాఖ కార్యకర్తలు నవీన్, మోహన్, సాయిలు, రాజేందర్, విష్ణు, పాండురంగ్,  నారాయణ, పాల్గొన్నారు.