ప్రాణాలను బలిగొంటున్న అక్బర్ నగర్ రహదారి

రోడ్డు విస్తీర్ణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్   రుద్రూర్, బతుకమ్మ: రోడ్డు విస్తీర్ణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి విస్తీర్ణ పనులలో భాగంగా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో రోడ్డు విస్తీర్ణ పనులు చేపడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి  మరణించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గుంతలు, పగుళ్లు, రోడ్డు వాలు, సరిపడని రహదారి ఉపరితలం వంటివి...