Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 2:24 pm Posted by : ramakrishna

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా బగ్గలి అజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్ ను నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఈ మేరకు జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బగ్గలి అజయ్ కి నియామాకపత్రం అందచేశారు. ఈ సంధర్బంగా నరాల సుధాకర్ మాట్లాడుతు…గతంలో బీసీ యువజన సంఘం నగర అధ్యక్షునిగా పనిచేసిన బగ్గలి అజయ్ బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నో రోజులుగా చేస్తున్న సేవలను చూసి గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావాలంటే యువత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. యువత సాధించలేనిది ఏమీ లేదని యువత గట్టిగా పోరాడితే అధికార పీఠాలు కూడా  కదులుతాయని అన్నారు, బీసీలకు చెందాల్సిన హక్కులు చెందుతాయని రాష్ట్ర కార్యదర్శి ఆకలి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్, గంగాధర్, సాయి, బసవ చంద్రకాంత్, మురళి, విజయ, సాయిలు, సదానంద్ తదితరులు పాల్గొన్నారు