Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 9:04 pm Posted by : ramakrishna

ఏఐయుకేఎస్ సంయుక్త మండల కార్యవర్గం ఎన్నిక

సిరికొండ, బతుకమ్మ : అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏ.ఐ.యు.కే.ఎస్) సంయుక్త మండల కార్యవర్గాన్ని మండలంలోని రావుట్ల గ్రామ మహా సభలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ ఎన్నికలో అధ్యక్ష,ప్రధానకార్యదర్శులుగా ఎం. లింబాద్రి, రిక్క దామోదర్ లను ఎన్నుకున్నారు.  ఉపాధ్యక్షులుగా బి. పెద్దన్న, వి. భూమాగౌడ్, బి. బాలకిషన్, సహాయకార్యదర్శులుగా ఎం. మోహన్, ఎస్. గంగమల్లు, ఏ. ఆశిస్, బి. సర్పంచ్ సాయిలు కోశాధికారిగా జి. కిరణ్ లను ఏకగ్రీవంగాఎన్నుకొన్నారు.ఎన్నిక అనంతరం నూతనకార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారన్నారు.

AIUKS Joint Mandal Executive Election