Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 1:33 pm Posted by : ramakrishna

జీజీహెచ్ కార్మికుల సమస్యలపై సుదర్శన్ రెడ్డికి ఎఐటియూసి వినతి

 

హైదరాబాద్, బతుకమ్మ :

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి స్వగృహంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ కలిసి సమస్యలతో కూడా వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిజిహెచ్ లో ప్రతిరోజు ఓపి 2500, ఐపి 200 పెరిగినందున ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదన్నారు. గతంలో 750 పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం చేసిన బడ్జెట్ కేటాయించలేకపోవడంతో సిబ్బందిని పెంచలేదన్నారు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పని భారం పెరిగి అనారోగ్యాల పాలవుతున్నారని కావున వెంటనే బడ్జెట్ కేటాయించి, కార్మికుల వేతనాలు పెంచడంతోపాటు, కార్మికుల సంఖ్యను పెంచుతూ ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు వారు తెలిపారు.