Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 7:35 pm Posted by : ramakrishna

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

 

. . . ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ బానోత్ రఘురాం అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తాలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతాయాన్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలోని ప్రెస్ క్లబ్ నుంచి భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.