Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:16 pm Posted by : ramakrishna

విద్యార్థుల సమస్యల కోసం ఉద్యమించేది ఏఐఎస్ఎఫ్

 

. . . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు విద్యార్థులు సిద్ధం కావాలి

 

. . . ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

 

. . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

దేశంలో, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై నిరంతర ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, విద్యార్థులు మత రాజకీయాలను తరిమి కొట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు విద్యార్థి లోకం సిద్ధం కావాలని, ఫిబ్రవరి 18నుండి 20వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మణికంఠ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధాలపై నిరంతర విద్యార్థుల పక్షాన నిలుస్తూ ఉద్యమాలు చేస్తుంది ఏఐఎస్ఎఫ్ అని, కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం విద్యార్థుల తరగతి గదుల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ విద్యార్థులను రాజకీయంగా ఓట్ల కొరకు వాడుకుంటున్నారని, బిజెపి 12 ఏళ్ల పాలనలో విద్యార్థులకు చేసింది ఏమీ లేదని, తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్రం నుండి తీసుకువచ్చిందేమీ లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఫిబ్రవరి 18 నుండి 20 వరకు నిజామాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, రాష్ట్ర  కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే, కూనంనేనీ సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్, జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ స్టాలిన్, విద్యావేత్తలు ప్రొఫెసర్లు హాజరుకానున్నారని,ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేయబడిన 500 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరుకానున్నారని, ఈ మహాసభల్లో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలకు సిద్ధమవుతామని, మహాసభల విజయవంతనికి విద్యార్థులు కృషి చేయాలని మణికంఠ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ  కార్యదర్శి బానోతు రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షుడు సుబోద్, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, సంజయ్, కార్తీక్, కోశాధికారి అనూష, నాయకులు కిషొర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.