ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం

హైదరాబాద్, బతుకమ్మ: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా ఖాద్రి హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దేశంలోనే ప్రథమ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పడి, నాటి నుంచి నేటి వరకు విద్యా రంగ సమస్యలు, సమానత్వం, శాస్త్రీయ విద్య కోసం పోరాటం చేస్తూ వస్తోంది. ఈ సంఘం నుంచి అనేక...