ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కి వాయుసేన గ్రీన్ సిగ్నల్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు.. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షంవ్యక్తం చేశారు. ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన...