Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 1:07 pm Posted by : ramakrishna

ఢిల్లీకి బయల్దేరిన ఏఐపీఎస్ యూ నాయకులు

నిజామాబాద్, బతుకమ్మ: కేంద్ర అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, యువజన, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన ఛలో పార్లమెట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన ఏఐపీఎస్ యూ నాయకులు తరలివెళ్లారు. ఢిల్లీకి బయల్దేరిన వారిలో జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి బోడ అనిల్, నగర కార్యదర్శి సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ సింగ్ ఠాకూర్, ఆనంద్, శివ, రాజు, స్వామి తదితరులున్నారు.