ఒలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలి

అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్, బతుకమ్మ :   ఇందూరు జిల్లా క్రీడాకారులు ఒలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా పెట్టుకొని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.  గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం 2024-2025 బహుమతుల ప్రదానోత్సవానికి ఎమ్మెల్యే  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండటం జిల్లాకు గర్వకారణమన్నారు. యువత మాదకద్రవ్యల, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రీడల్లో...