Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 7:18 pm Posted by : ramakrishna

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

  • జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

 

బిచ్కంద, బతుకమ్మ : తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అనిజుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు.  బిచ్కుంద మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో రజక సోదరు లతో కలిసి పాల్గొన్నారు.  చాకలి ఐలమ్మ చిత్రపటానికి   పూలమాల వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ, సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికీ ఆదర్శం కావాలి అని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారు ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని అన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తిని ప్రపంచానికి చాటే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, రజక సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ కుటుంబం స్వార్థపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించుకుందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే, బిఆర్ఎస్ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లయన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Ailamma's fighting spirit should be taken as an example