Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 5:30 pm Posted by : ramakrishna

టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ భూమికోసం ,భుక్తి కోసం, వెట్టి చాకిరి  విముక్తి కోసం దొరల, భూస్వాముల పై తిరగబడ్డ బహుజన ధీరత్వ పతాక.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి అని అన్నారు. చాకల ఐలమ్మ ఆశల కోసం బహుజన రాజాధికారం కోసం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ నాయకత్వం ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గాయ్య మాదిగ, టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు దారి హరీష్, మెండోర మండల అధ్యక్షులు పాలెం వంశిరాజ్ తదితరులు పాల్గొన్నారు.