Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 5:45 pm Posted by : ramakrishna

మహిళలకు ఐద్వా అండగా ఉంటుంది

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :

 

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మహిళలకు ఐద్వా అండగా ఉంటుందని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో  అఖిలభారత ప్రజాతంత్ర 14 జాతీయ మహాసభల సందర్భంగా ఐద్వా జండా ఆవిష్కరించారు. అలాగే బెలూన్స్ పై ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయండి అని రాసి చిన్నపిల్లలతో ప్రదర్శించంపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దేశంలో అనేక రకాలుగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అండగా నిలిచిందన్నారు. ఈ నెల 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరగబోయే 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఐద్వా మండల కమిటీ సభ్యులు నస్రత్ లక్ష్మి, దూర్పతి బాయ్ శమ్మ, హసీనా బేగం, కవిత, కల్పన, సరిత, గంగమణి, రజియా, చాంద్ బి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

Aidwa stands by women
Aidwa stands by women