ఐద్వా ఆల్ ఇండియా మహా సభల కరపత్రం ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, పెరిగిన నిత్యవస ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రేమోన్మాద దాడులు, విద్య వైద్యం ఉద్యోగం ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ దేశంలో రాష్ట్రంలో ఐద్వా గుర్తింపు పొందిందని తెలిపారు. దేశంలో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. అందరూ ఆలిండియా...