Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 6:21 pm Posted by : ramakrishna

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం, జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యం లో సోమవారం ఎయిడ్స్ దినోత్సవం లో భాగంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపాల్  డాక్టర్ ఇ.లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు లకు ఎయిడ్స్ వ్యాధి గురికాకుండా  జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. మన చుట్టూ ఉన్న ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహనా కల్పించే బాధ్యత యువత అయినా నేటి విద్యార్థులదే అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సైన్స్ విభాగం అధిపతి డా.బుద్దె అరుణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు,  ఎన్ఎస్ఎస్ యూనిట్ కార్యక్రమ అధికారులు చంద్రకాంత్, రాణి, అధ్యాపకులు డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దురాజు, కృష్ణ ప్రసాద్, డాక్టర్ గోదావరి, శశిధర్, రాజు,సంతోష్, సురేష్ రెడ్డి, సంగీత, కీర్తి స్వప్న, కిరణ్ కుమార్, మొయిన్,మహమూద్ మరియు  వసంత లక్ష్మి సూపర్నెంట్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

AIDS Day rally at Government Degree College