హైదరాబాద్,బతుకమ్మ : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో శుక్రవారం జరిగే పార్టీ గ్రామ స్థాయి అధ్యక్షుల సమావేశంలో ఖర్గే తొలిసారిగా పాల్గొననున్నారు.
