Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:37 pm Posted by : ramakrishna

సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించడంలో ఏఐ ఉపయోగపడుతుంది

 

. . . జి.జి లో కృత్రిమమేధ అవగాహన & ఆవిష్కరణ దినోత్సవం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తక్కువ సమయంలో, ఎక్కువ  సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించడంలో సహాయకారిగా కృత్రిమమేధ ఉపయోగించుకోవచ్చని సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు గుర్రం శ్రవణ్ కుమార్ అన్నారు. గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 వ రోజైన శనివారం “విద్యావారోత్సవాల్లో – కృత్రిమమేధ (ఏఐ) అవగాహన & ఆవిష్కరణ దినోత్సవం, కృత్రిమమేధ పరికరాలపై వేబినర్, సురక్షిత పెట్టుబడి పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు” నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రవణ్ కుమార్ ముఖ్య వక్తగా నిర్వహించిన వేబినర్లో కృత్రిమమేధ (ఏఐ) పరికరాలపై అవగాహన కలిగించారు. ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. సీఈఓ, పాతూరి సత్యనారాయణ ముఖ్యవక్తగా “సురక్షిత పెట్టుబడి పద్ధతులు: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించారు. డబ్బును సరైన విధంగా సంపాదించడం, సేవ్ చేయడం, పెట్టుబడి పెట్టడం, ఖర్చు నియంత్రించడం, భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించడం, సరైన ఆర్థిక జ్ఞానంతో మోసాల నుంచి రక్షణ, భవిష్యత్తు భద్రత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, ఏ.వో.రామ్ కిషన్, సమన్వయకర్తలు రాజేశ్, వినయ్ కుమార్, దండు స్వామి, బాలమణి, రామస్వామి, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్న, రంజిత, జయ ప్రసాద్, అధ్యాపకులు నహీదా బేగం, వివేకానంద, నాగజ్యోతి, రమణ, దస్తప్ప, నరేశ్ కుమార్, సుధాకర్, రజిత,  కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.