Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 2:48 pm Posted by : ramakrishna

 హిందూ దేవాలయాలకు మార్గదర్శకురాలు అహల్య బాయ్ హోల్కర్

 అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్, బతుకమ్మ : అహల్య బాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్బంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు.  అహల్యాబాయి హోల్కర్ హిందూ దేవాలయాలకు మార్గదర్శకురాలు, నిర్మాణకర్త అని అన్నారు. దేశంలో ద్వారక మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణలో ఆమె కృషి ఎంతో ఉందన్నారు. హిందువులపై, హిందూ దేవాలయాలపైన జరుగుతున్నా దాడులను అందరం సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగోళ్ళ లక్ష్మినారాయణ,  ప్రోగ్రాం కన్వినర్ పోతంకర్ లక్ష్మినారాయణ, కో కన్వినర్ ప్రవళిక,  స్రవంతి  , జ్యోతి బీజేపీ మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.