వరద ప్రాంతాలను పరిశీలించిన ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు
బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రహదారులపై చేరి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు, కాలనీల్లో నిలిచిపోయి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పట్టణంలోని పలు ప్రాంతాలను స్వయంగా ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఇంజనీర్లతో పరిశీలించారు....