Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 8:08 pm Posted by : ramakrishna

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వ్యవసాయ అధికారులు

 

. . . ఎన్.ఎం.ఎఫ్ కార్యక్రమం పై అవగాహన కల్పించిన మంత్రి

 

ఇందల్ వాయి, బతుకమ్మ

 

ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామ రైతు వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఎన్ఎంఎఫ్ పరిధిలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం కల్పించేందుకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఘనంగా ప్రారంభించారు. సహజ వ్యవసాయం ద్వారా పంటల దిగుబడి పెంపుతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సహజ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు పూడూరి నవీన్ వ్యవసాయ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన అనుభవాలను తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహజ వ్యవసాయ కిట్లను సమర్థంగా వినియోగించి రైతులు ప్రయోజనం పొందాలని కోరారు. ఈ కిట్లు సహజ వ్యవసాయంలో అవసరమైన ప్రాథమిక పదార్థాలు, పద్ధతులపై అవగాహన కల్పించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్) పద్మావతి, అసిస్టెంట్ డైరెక్టర్లు, కృష్ణ, కోటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి నల్లవెల్లి రామకాంత్, నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్, ఆత్మ కమిటి మెంబెర్ కుంట గంగారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

Agriculture officials participated in the Rythu Nestham video conference