నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శ్రద్ధానంద్ గంజ్ లోని కూరగాయల మార్కెట్ ను
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హమాలీ వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్, ముల్లె హమాలీ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కూరగాయల మార్కెట్లో కార్మికులు, రైతులు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. బాతురూములు, హమాలీ కార్మికులకు విశ్రాంతి భవన ఏర్పాటు చేయాలని కోరారు. బయట నుండి ప్రైవేట్ వెహికల్స్ రావడం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని కోరారు. హమాలి కార్మికులకు కార్డుల గురించి, దోమల నియంత్రణకై చర్యల తీసుకోవాలని అన్నారు. హమాలీ కార్మికులకు డ్రస్సు ఇవ్వాలని, లలిత మహల్ టాకీస్ నుండి అర్సపెల్లి వేపుగా నిజాం కాలనీ వరకు మెయిన్ రోడ్ పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరగాయల హమాలి వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్, ముల్లె కార్మిక సంఘం ల తరఫున నాయకులు ఎం , ఎం మోహన్, ఎం రాజు, పీరయ్య, మల్లేష్, గంగాధర్, వకీల్ అన్వర్, రమేష్, సాయిలు, ఇర్ఫాన్, కిషోర్, ఫెరోజ్, పవన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.