Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 5:40 pm Posted by : ramakrishna

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అగ్రీకల్చర్ ఎఓ

 

. . . ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ సవ్యంగా జరగాలని లంచం ఇవ్వాల్సిందే

 సంగారెడ్డి, బతుకమ్మ:

ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ సవ్యంగా జరగాలంటే లంచం ఇవ్వాలని వేధిస్తున్న మండల వ్యవసాయ అధికారి ఏసీబీకి చిక్కాడు. ముందుగా డిమాండ్ చేసినట్లు రూ.10 వేలు తీసుకుని మరో ఇరవై వేల కోసం వేధిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ శాఖాధికారి జి. రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఆయన కార్యాలయంలో ఏసీబీ పట్టుకుంది. తన పరిధిలోని ఫర్టిలైజర్ నిర్వాహకుడిని రూ.30 లంచం డిమాండ్ చేశారు ఎఓ.  తన మామ కోసం అల్లుడు  అక్టోబర్ 10న రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలి లేకపోతే కేసులు, తనిఖీల పేరిట వేధింపులు తప్పవని బెదిరిస్తుండటంతో బాధితుడి అల్లుడు ఎసిబిని ఆశ్రయించారు మంగళవారం ఎఓ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు