Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 2:20 pm Posted by : ramakrishna

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరలిస్తే సహించేది లేదు

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి నియోజకవర్గగంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కె సి అర్ విప్లవాత్మకమైన నిర్ణయంతో నాగిరెడ్డి పెట్ మండలంలోని మాల్టుమ్మెద శివారులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణికి గురై కళాశాలను ఎత్తివేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్షం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఐటిఐ కళాశాలను తరలించే ప్రయత్నం చేస్తే బిఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నతాధికారులతో చర్చించి ఎత్తివేసే ప్రయత్నం విరమించిన విషయం గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను తరలించే కుట్ర చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అదే నిజమైతే బిఆర్ఎస్ పార్టీ తరపున త్వరలోనే కళాశాల సందర్శన కార్యక్రమం చేపడుతామని అన్నారు. అప్పుడు అందులో ఉన్న లోపాలపై మరో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కళాశాల పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి తెలిపారు. అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకుపోతోందని చెప్పుకునే పాలకులు దీనిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నర్సింలు, రాము, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.