వ్యవసాయ యాంత్రీకరణ .. అన్నదాతకు ఆసరా
. తగ్గనున్న సాగు భారం . రాయితీపై పనిముట్లు . యాసంగి నుంచి ఇచ్చేందుకు సన్నాహాలు నిజామాబాద్, బతుకమ్మ: గత కొన్నేళ్లుగా వ్యవసాయ పనిముట్లు పొందేందుకు అవకాశం లేని రైతులకు త్వరలో ఊరట లభించనుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సాగు పనిముట్లను రాయితీపై అందజేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు అవసరమైన పనిముట్లు అందజేయాలని యోచిస్తోంది. కొన్నేళ్లుగా పథకాలకు మంగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు మరిన్ని రాయితీ పథకాలు వస్తాయని ఆశించిన రైతాంగానికి కేవలం...