ఆగనిఫైనాన్స్ అక్రమ దందా
బతుకమ్మ, బిచ్కుంద : పేదప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని డైలీ ఫైనాన్స్, చిట్టీలు అంటూ జోరుగా దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా బహిరంగగానే జరుపుతూ అధికవడ్డీ వసూలు చేస్తూ అమాయకులను రోడ్డున పడేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపించడం షరా మాములైంది. బిచ్కుంద పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సైతం అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఈ దందాలో కూరుకుపోయేది మధ్యతరగతి, చిరు వ్యాపారులనే టార్గెట్ చేస్తూ డైలీ, విక్లీ అంటూ అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ వసూలు చేస్తూ...