నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం నాడు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ 20 రోజులుగా సమ్మె చేస్తున్న పరిష్కారం చూపించకుండా అధికారులు కస్తూర్బాలలో ప్రత్యేక అధికారులను నియమించడం తో వారికి పుష్పగుచ్చుమించి నిరసన తెలపడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తపరచిన సమయంలో హనుమకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాకు అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మీయొక్క సమస్యను మేము అధికారంలోకి రాగానే 10 నిమిషాలలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తమరే అధికారంలో ఉండడం వల్ల మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. రెగ్యులరైజేషన్ రాష్ట్రంలో కొత్త ఎం కాదని ఐకెపి వీఆర్ఏలను కాంట్రాక్టు లెక్చరర్ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.