Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 1:50 pm Posted by : ramakrishna

గడుగును సన్మానించిన ఏఈవోలు

ఇందూర్, బతుకమ్మ: వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగ గంగాధర్ ను నిజామాబాద్ లోని ఆయన నివాసంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షుడు  రాజ్ కుమార్ బదావత్ మాట్లాడుతూ.. శాఖలో నూతనోత్తేజాన్ని నింపే దిశగా, వ్యవసాయ విస్తరణను పటిష్టం చేసే ఉద్ధేశంతో ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణతోపాటు ఆత్మ కమిటీల నియామకం కోసం కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఆదర్శ రైతులు వ్యవసాయ శాఖ తో మమేకమై కలిసి పని చేసే విధంగా వారికి జాబ్ చార్ట్ , కనీస విద్యార్హతలు, కనీస గౌరవ భృతి ఉండే విధంగా కృషి చేయాలని గడుగు గంగాధర్ ను ఏఈవోలు కోరారు. ఐక్య వేదిక అధ్యక్షుడితోపాటు  నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ఏఈవోలు రాజు నాయక్, నృపేష్, జ్ఞానేశ్వర్, చక్రపాణి, శరత్, సంధ్య రేఖ, కృష్ణ రెడ్డి, రాజా తదితరులు పాల్గొన్నారు.