రేపు అడ్వకేట్స్ పరపతి సహకార సోసైటీ ఎన్నికలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అడ్వకేట్స్ పరపతి సహకార సొసైటీ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు డైరెక్టర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. నాలుగు డైరెక్టర్ పదవులకు ఐదుగురు పోటీ చేస్తున్నారని తెలియజేశారు. మొత్తం నాలుగు ఓట్లు వేయాలని సూచనలు చేశారు. సొసైటీ బై లా ప్రకారం ప్రతి సంవత్సరం నలుగురు డైరెక్టర్లు పదవి విరమణ చేస్తారని వారి స్థానంలో నూతన డైరెక్టర్ల...