Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 6:16 pm Posted by : ramakrishna

పెద్ద మనసుతో పెద్దలు క్షమించాలి

  • బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
  • విలేకరుల సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్

 

హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పెద్దమనసుతో క్షమించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావ్ కోరారు. తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు తనకు వచ్చిన క్రమశిక్షణ నోటీస్ పై హైదరాబాద్ లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫోన్ ద్వారా మాట్లాడానని, అందులో రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు జాతీయ అధ్యక్షురాలు ఆల్కలాంబ ని స్వయంగా కలిసి మాట్లాడానని తెలిపారు. గాంధీ భవన్ లో జరిగిన విషయాలు చాలా బాధాకరమని, ఉద్దేశ్య పూర్వకంగా చేసింది కాదని, తను చేసినా, తన మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు చేసిన  బాధ్యత తనదే అని పెద్ద మనసు చేసి అందరూ తనను, మహిళా కాంగ్రెస్ నాయకులను క్షమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరానని తెలిపారు. టి.పి.సి.సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్ కి పెద్ద పీఠ వేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరికీ కూడా సమ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నాను అని వచ్చే వార్త పూర్తిగా అవాస్తవం అని, ఆ వదంతులన్నీ నమ్మవద్దని అన్నారు. తాను అధిష్టానం నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటానని తెలిపారు.

  • మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ..

జాన్ 3వ తేది నుంచి ఢిల్లీ లోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మంగళవారం రాష్ట్రం నుంచి 5 గురి జిల్లా అధ్యక్షులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.