కందర్ పల్లిలో కల్తీకల్లు తాండవం
బిచ్కుంద, బతుకమ్మ : కందర్ పల్లి గ్రామంలో పొద్దునే చాయ్ తాగినట్టుగా చాలా మంది. కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాట పడుతున్నారు కొంతమంది. వ్యాపారులు. కార్మికులు, కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వింత మత్తును అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఒల్లు గుళ్ల చేసి ఆస్పత్రుల చుట్టూ తిప్పిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా...